సకాలంలో వైద్యం అందక మహిళ మృతి.. ఆసుపత్రికి తాళం..

సకాలంలో వైద్యం అందక మహిళ మృతి.. ఆసుపత్రికి తాళం..

ఆసుపత్రిలోని వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగ్రహంతో గ్రామస్తులు ఆసుపత్రికి తాళాలు వేశారు. శుక్రవారం ఓ మహిళకు వడదెబ్బ తగిలింది. వెంటనే మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే సిబ్బంది ఎవరూ కనిపించలేదు. 108కి ఫోన్ చేసినా కూడా ఎవరూ స్పందించలేదు. దీంతో ఆటోలో సూర్యాపేట ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో సిబ్బంది లేకపోవడంతో వల్లే మహిళ మృతిచెందినట్టు స్థానికులు ఆరోపించారు. సిబ్బంది విధులకు రావడం లేదని.. సమయానికి చికిత్స అందించి ఉంటే.. మహిళ బతికి ఉండేదని వాపోతున్నారు. ఈ ఘటనలతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తాళం వేశారు.

Tags

Read MoreRead Less
Next Story