పాతబస్తీలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రెచ్చిపోయిన మైనర్లు

హైదరాబాద్ పాతబస్తీలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మైనర్లు రెచ్చిపోయారు. సంతోష్ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు రోడ్లపై డేంజర్ స్టంట్స్ చేశారు. మైనర్ల ర్యాష్ డ్రైవింగ్, డేంజర్ స్టంట్స్ ఇతర వాహనదారులు హడలెత్తిపోయారు. అడ్డుకునే వాళ్లే లేకపోవటంతో చంద్రాయణ గుట్ట వరకు ప్రమాదకరంగా బైక్ నడుపుతూ అందర్ని భయపెట్టారు.
ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ఈ పోకిరి బ్యాచ్ ర్యాష్ డ్రైవింగ్ తో చెలరేగిపోవటం అలవాటుగా మారిపోయింది. పట్టించుకోవాల్సిన పోలీసులు ఫైన్లతో సరిపెడుతుండటంతో ఇలాంటి పోకిరి బ్యాచ్ ల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. మైనర్లకు బైకులు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా తల్లిదండ్రులు మాత్రం పోలీసుల హెచ్చరికల్ని ఖాతరు చేయటం లేదు. దీంతో తల్లిదండ్రులు కూడా ప్రమాదాలకు పరోక్ష కారణం అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com