హోం మంత్రి ఫోన్‌.. చర్చి ఫాదర్ అరెస్ట్

హోం మంత్రి ఫోన్‌.. చర్చి ఫాదర్  అరెస్ట్

తాడిపత్రిలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక రేప్ కేసులో.. ఎట్టకేలకు చర్చ్ ఫాదర్‌ను అరెస్ట్ చేశారు. మార్చిలోనే చర్చిఫాదర్ పై కేసు నమోదు అయింది. కానీ అరెస్ట్ మాత్రం చేయలేదు. చివరికి హోం మంత్రి ఫోన్‌ చేయడంతో పోలీసుల్లో కదలిక వచ్చింది. అరెస్ట్‌ చేసిన చర్చి ఫాదర్‌పై ఫోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

లైంగిక వేధింపుల కేసులో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్‌సీఎం చర్చి ఫాదర్‌ ఎమిలిరాజ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. 8వ తరగతి బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో చర్చి ఫాదర్ పై మార్చిలోనే కేసు నమోదైంది. ఫాదర్‌ను అరెస్ట్‌ చేయాలంటూ బాధితురాలి తల్లి పలుమార్లు స్థానిక పోలీసు అధికారులను వేడుకున్నా ఫలితం లేకపోయింది. బాలిక తల్లిదండ్రులు హోం మంత్రి సుచరితను కలిసి ఫిర్యాదు చేశారు.. దీంతో ఈ కేసులో మళ్లీ ఒక్కసారిగా కదలిక వచ్చింది. చివరికి హోం మంత్రికి ఫోన్‌చేయడంతో పోలీసుల్లో కదలిక వచ్చింది. చివరకు చర్చి ఫాదర్‌ను అరెస్ట్ చేశారు.

నాలుగురోజుల కిందట నిందితుడుని అరెస్ట్ చేసేందుకు RCM చర్చ్ కు వెళ్లారు పోలీసులు. అయితే అక్కడికి భారీగాచేరుకున్న చర్చ్ ఫాదర్ మద్దతుదారులు పోలీసుల్ని అడ్డుకున్నారు.. బాలిక తల్లి ఆరోపణలలో వాస్తం లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు .. కేసు నమోదై రెండున్నర నెలలు కావస్తున్నా ఎందుకు అరెస్ట్‌ చేయలేదంటూ జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. మూ డు పోలీసు బృందాలను రంగంలోకి దించారు. పెద్దపప్పూరు మండలం జూటూరు సమీపంలో ఎమిలిరాజ్‌ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తాడిపత్రి డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి, పెద్దపప్పూరు ఎస్‌ఐ ప్రసాద్‌, సిబ్బంది అతన్ని అరెస్టు చేశారు

వారం రోజులుగా ఎన్నో మలుపులు తిరిగి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన చర్చి ఫాదర్‌ అరెస్ట్‌ కావడం పట్ల పోలీసు అధి కారులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో రాష్ట్ర హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌లు జిల్లా ఎస్పీ బూసారపు సత్యయేసుబాబును ప్రశంసించా రు. ఎస్పీతో పాటు కేసులో కీలకంగా పనిచేసిన పోలీసులందరికి అభినందనలు తెలిపారు.

Tags

Next Story