కాన్ఫిడెంట్‌గా ఆడుతోన్న టీమిండియా

కాన్ఫిడెంట్‌గా ఆడుతోన్న టీమిండియా

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా కాన్ఫిడెంట్‌గా ఆడుతోంది. ఓపెనర్లు రాహుల్, రోహిత్‌శర్మ పాక్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. ఫామ్‌లో ఉన్న రోహిత్‌శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసీస్‌పై వ్యూహం తరహాలోనే మొదటి పవర్ ప్లేలో సింగిల్స్‌కే ప్రాధాన్యమిచ్చిన భారత్ భారీస్కోరుపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఒక మార్పుతో బరిలోకి దిగింది. ధావన్ స్థానంలో విజయ్ శంకర్‌కు అవకాశమిచ్చింది. అటు వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకున్న పాక్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలింగ్‌ లైనప్‌ ఫామ్‌లో ఉండడంతో ఈ పోరులో పాకిస్థాన్ ఛేజింగ్‌ చేయడం కష్టమే.

Tags

Read MoreRead Less
Next Story