తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కుదుపు

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కుదుపు. టీఆర్‌ఎస్‌కు బీజేపీ సరైన ప్రత్యామ్నాయంగా చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏమాత్రం తగ్గేలా లేరు. ఆయనకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకమాండ్ ఆదేశఇంచగా.. పీసీసీ కమిటీ రేపు సమావేశం కాబోతోంది. షోకాజ్ నోటీసు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు.. రాజగోపాల్‌రెడ్డి మాత్రం ఏమాత్రం తగ్గేలా లేరు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ యాక్షన్ చూసి... తర్వాత మరోసారి స్పందిస్తానంటూ ఆయన సూటిగా చెప్తున్నారు.
బీజేపీలో చేరాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడమే ఆయన ఆగ్రహానికి కారణంగా చెప్తున్నారు. కేసీఆర్‌తో తలపడాలంటే.. కేవలం డబ్బే కాదు.. బీజేపీ లాంటి పార్టీ అవసరం కూడా ఉందని రాజగోపాల్ రెడ్డి నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. అందుకే.. వ్యూహాత్మకంగా వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వీడడంతో.. కష్టాల్లో పడిన కాంగ్రెస్.. రాజగోపాల్‌రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com