పాక్‌కు గట్టి జలక్‌..ఒకే రోజులో కొడుకు తండ్రైపోతాడంటూ పంచ్‌

పాక్‌కు గట్టి జలక్‌..ఒకే రోజులో కొడుకు తండ్రైపోతాడంటూ పంచ్‌

వరల్డ్‌కప్‌ నేపథ్యంలో ఇండియా-పాకిస్తాన్‌ మధ్య వీడియో వార్‌ కొనసాగుతోంది. అభినందన్‌ను అవమానిస్తూ దాయాది ఒక్క యాడ్‌ వదిలితే...భారత్‌ వరుస కౌంటర్ వీడియోలతో పాక్‌కు చుక్కలు చూపిస్తోంది. సోషల్‌ మీడియాలో అభినందన్‌ అవమానించిన పాక్‌పై... అదే సోషల్‌ మీడియాలో సెటైరిక్‌ వీడియోల ద్వారా కసి తీర్చుకుంటున్నారు ఇండియన్‌ నెటిజన్లు. నిన్న బాలీవుడ్‌ నటి పూనం పాండే తనదైన శైలిలో పాకిస్తాన్‌కు కౌంటర్‌ ఇస్తే.. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ విడుదల చేసిన మౌకా మౌకా అనే వీడియో పాక్‌కు గట్టి జలక్‌ ఇచ్చింది.

ఈ వీడియో సారాంశం ఏంటంటే. ఓ భారత క్రికెట్ అభిమాని సెలూన్‌లో ఉండగా.. పాక్ అభిమాని అక్కడికి వచ్చి ఫాదర్స్ డే గిఫ్ట్ ఇస్తాడు. దాన్ని తెరిచి చూస్తే అందులో ఓ రుమాల్‌ ఉంటుంది. అదేంటీ రుమాల్ ఇచ్చావని భారత అభిమాని అడిగితే... మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత ముఖం దాచుకోడానికి పనికి వస్తుందంటూ పాక్‌ అభిమాని సమాధానం ఇస్తాడు. ఆ తరువాత సేవింగ్ చేయించుకోడానికి సిద్ధమమైన ఆ పాక్‌ ఫ్యాన్‌....ఈ గేమ్ ఏం బాగాలేదని.. ఒకే రోజులో కొడుకు తండ్రైపోతాడంటూ పంచ్‌ వేస్తాడు. దీంతో భారత అభిమానికీ, బార్బర్‌కూ కోపం వస్తుంది. భారత అభిమాని బార్బర్‌ వైపు చూసి కంటితో సైగ చేస్తాడు. దీంతో బార్బర్.. పాక్ అభిమానికి అభినందన్‌లా ఉండేట్టు గడ్డం, మీసాలను కట్ చేస్తాడు. అది చూసి బిత్తరపోయిన పాక్‌ అభిమాని..తన ముఖం ఎవరికి చూపించుకోవాలంటూ ఏడుపు ముఖం పెడతాడు. భారత అభిమాని అతనికి రుమాలు తిరిగిచ్చి ముఖందాచుకో అని చెప్పడంతో వీడియో ముగుస్తుంది.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. భారత నెటిజన్లు ఈ వీడియోను షేర్‌ చేస్తూ ఎంకరేజ్‌ చేస్తున్నారు. పాక్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చామని సెటైర్లు వేస్తున్నారు. యూట్యూబ్‌లో వీడియోను అప్‌లోడ్‌ చేసిన ఒక్క రోజులోనే 10 లక్షలకుపైగా వ్యూస్‌ రావడం విశేషం.

అంతకు ముందు బాలీవుడ్ నటి పూనమ్ పాండే కూడా ఓ వీడియోతో పాక్‌కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. పాకిస్తాన్‌కు వీడియో చూపించి.. చాయ్ తాగుతూ తనదైన రీతిలో స్పందించారు ఈ హాట్ స్టార్. మీకు కావాల్సింది... ప్రపంచకప్ కాదు... నా బ్రా కప్పు అంటూ కామెంట్ చేశారు. భారత్ కు చాయ్ కప్పు చాలు.. కానీ మీకు ప్రపంచ కప్ కాదు.. నా బ్రా కప్పు చాలంటూ సెల్పీ వీడియో తీసి మరీ కౌంటర్‌ ఎటాక్‌ చేశారు పూనం పాండే.

మరికొన్ని గంటల్లో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో సోషల్‌ మీడియోలో ఈ సెటైరిక్‌ వీడియోలు హాట్‌ టాపిగ్గా మారాయి

Tags

Read MoreRead Less
Next Story