టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌

టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ను తలపిస్తున్న హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.. పిచ్‌ ఆరంభంలో బౌలర్లకు సహకరిస్తుందనే నమ్మకంతో ఫీల్డింగ్‌ ఎంచుకున్నట్టు పాక్‌ కెప్టెన్‌ సర్ఫారజ్‌ చెప్పాడు. భారత్‌ విషయానికి వస్తే జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. ఓపెనర్‌ ధావన్‌ గాయంతో మూడు వారాల పాటు టోర్నీకి దూరమయ్యాడు.. అతడి స్థానంలో ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నాడు కెప్టెన్‌ కోహ్లీ.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ ఇన్నింగ్స్‌ను లోకేష్‌ రాహుల్‌తో కలిసి రోహిత్‌ శర్మ ఆరంభించడు. వన్‌ డౌన్‌లో కోహ్లీ, నాలుగో నెంబర్‌ బ్యాట్స్‌మెన్‌గా విజయ్‌ శంకర్‌ వచ్చే అవకాశం ఉంది.. ఇప్పటి వరకు వరల్డ్‌ కప్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ ఒక్కసారి కూడా నెగ్గలేదు. మరోసారి అదే కంటిన్యూ అవుతుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story