మందేసి చిందేసిన ప్రభుత్వాధికారులు..సస్పెండ్ చేసిన కలెక్టర్

మందేసి చిందేసిన ప్రభుత్వాధికారులు..సస్పెండ్ చేసిన కలెక్టర్

ప్రభుత్వాధికారులు ఒళ్లు మరిచి మందేసి చిందేశారు. మందు సీసాలు నోట్లో పెట్టుకుని పాటలకు అనుగుణంగా డ్యాన్సులు వేశారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. పోతుగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధికారులు, సిబ్బంది తీరు వివాదాస్పదమవుతోంది..

మందు బాబులం మేం.. మేం మందు బాబులం.. మాకు మేమే మహారాజులం అంటూ మందేసి చిందేశారు ప్రభుత్వాధికారులు. బ్యాక్ గ్రౌండ్‌లో హుషారైన పాటలతో రెచ్చిపోయారు. నోట్లో బీరు బాటిళ్లతో పాటలకు అనుగుణంగా డ్యాన్సులు వేశారు. తమ స్థాయిని మరిచి మద్యం మత్తులో ఊగిపోయారు..ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. పోతుగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధికారులు, సిబ్బంది కలిసి చిందులు వేశారు. గంభీరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజేందర్, ముస్తాబాద్ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, ఎల్లారెడ్డి పేట, సిరిసిల్ల మార్కెట్ కమిటీ సిబ్బంది తో కలసి మద్యం మత్తులో బీరు బాటిల్స్ తో చిందులు వేస్తూ వీడియోలు తీసుకున్నారు. ఒళ్లు మరిచేలా మద్యం సేవించి నానా హంగామా చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమంటూ సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేస్తూ కేసులు పెట్టి జరిమానాలు కట్టించుకునే పోలీసులకు ఇలాంటివి కనబడవా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఆదర్శంగా ఉండాల్సిన అధికారులు ఇలా బహిరంగంగా చిందులు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story