కేసీఆర్‌కు ఆ ఉద్దేశం లేదు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

కేసీఆర్‌కు ఆ ఉద్దేశం లేదు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీరుపై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవాలనే ఉద్దేశం కేసీఆర్‌కు లేదని.. అందుకే నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లలేదని ఆరోపించారు. పాలనను పక్కన పెట్టేసిన కేసీఆర్‌కు మొహం చెల్లకే నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లలేదని ఎద్దేవ చేశారు..

తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఈ నెలాఖరు నుండి పార్టీలో చేరికలు ఉండబోతున్నాయన్నారు. ఏదో పదవులు ఆశించి పార్టీలోకి రాకూడదని.. ముల్లబాటను దాటేందుకు సిద్దంగా ఉన్నవారే పార్టీ లో చేరాలని ఆయన అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story