ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క...ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ వస్తే ఆయన తండ్రి YSR ఆత్మ క్షోభిస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ , అవకతవకలకు పరోక్షంగా సమర్థించినట్లు అవుతుంది కాబట్టి ప్రారంభోత్సవానికి రావద్దని లేఖలు కోరారు.ప్రాజెక్టుల టెండర్ల వివరాలు జ్యుడీషియల్ కమిషన్ ముందు పెడతామన్న జగన్ నిర్ణయాన్ని భట్టి విక్రమార్క స్వాగతించారు. తెలంగాణలోనూ అదే తరహాలో చేయాలని డిమాండ్ చేశారు..కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు జ్యుడీషియల్ కమిషన్ ముందు ఉంచాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈనెల 21న ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ను ఆహ్వనించాలని కేసీఆర్ నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

