ట్రాక్టర్‌ను స్టార్ట్ చేసిన చిన్నారులు.. ఆడుకుంటున్న బాలుడిపై నుంచి..
BY TV5 Telugu17 Jun 2019 11:41 AM GMT

X
TV5 Telugu17 Jun 2019 11:41 AM GMT
గుంటూరు జిల్లా తెనాలిలోని అమరావతి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్ ను స్టార్ట్ చేశారు చిన్నారులు. దీంతో అది అదుపు తప్పి పక్కనే ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి దూసుకుపోయింది. దీంతో పవన్ అనే రెండేళ్ల బాబు అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ట్రాక్టర్ ను రోడ్డుపై ఆపిన డ్రైవర్ కీని ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నిస్తున్నారు. అసలు ఇళ్ల మధ్యకు ఇసుక ట్రాక్టర్ ఎందుకు వచ్చిందో విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story