అసెంబ్లీలో ఆ అంశంపై అభ్యంతరాలు తెలపాలని టీడీపీ నిర్ణయం

అసెంబ్లీలో ఆ అంశంపై అభ్యంతరాలు తెలపాలని టీడీపీ నిర్ణయం

రెండు రోజుల విరామం తరువాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. సభలో ముఖ్యంగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఇప్పటికే గవర్నర్‌ ప్రంసంగంపై ప్రతిపక్ష టీడీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వైసీపీ కరపత్రంలా ఆయన ప్రసంగం సాగిందని.. ఏపీ రాజధాని అమరావతి గురించి ప్రస్థావనం లేకపోవడం ఏంటని ప్రశ్నించింది. ఇదే అంశంపై ఇవాళ సభలో అభ్యంతరాలు తెలపాలని టీడీపీ నిర్ణయించింది.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ కార్యకర్తలపైన జరుగుతున్న దాడులను కూడా సభ దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉంది. అలాగే గన్నవరం ఎయిర్‌పోర్టులో చంద్రబాబును తనిఖీలు చేసే ఇష్యూను లేవనెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ, రేపు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

Tags

Next Story