పాకిస్తాన్ కు ఇంటా బయటా విమర్శలు.. ఉక్కిరిబిక్కిరి..

భారత్ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్ కు ఇంటా బయటా విమర్శలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆటగాళ్ల తీరుపై మాజీలు మండిపడుతున్నారు. టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకోవాలని... దిగ్గజ క్రికెటర్, ప్రస్తుతం ఆదేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూచించారు. వకార్ యూనిస్ వంటి వాళ్లు సైతం సంకేతాలు ఇచ్చారు. కానీ ఇందుకు భిన్నంగా కెప్టన్ సర్ఫరాజ్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. సర్ఫరాజ్ నిర్ణయాల కారణంగానే పాకిస్తాన్ ఓడిపోయిందని మాజీలు విమర్శలు గుప్పించారు.
అటు మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ కూడా పాకిస్తాన్ టీంపై తీవ్ర విమర్శలు చేశారు. మెదడులేని.. కనీస అవగాహన లేని టీం వల్లే పాకిస్తాన్ పరువు పోయిందన్నారు. ఏమాత్రం ఆలోచన లేకుండా అనాలోచితంగా ఆడడం వల్లే జట్టు ఓడిపోయిందన్నారు.
టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ తీసుకుని ఉంటు... భారీ స్కోర్ చేసి పటిష్టమైన బౌలర్లతో భారత్ పై ఒత్తిడి పెంచేఅవకాశం ఉండేదన్నారు. చేతికి వచ్చిన అవకాశాన్ని సర్ఫరాజ్ భారత్ కు ఇచ్చారన్నారు. అత్యంత చెత్త నిర్ణయమన్న మాజీలు... రానున్న మ్యాచ్ లలో అయినా.. సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com