ఏపీ సీఎం జగన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం

ఏపీ సీఎం జగన్‌తో  తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం

ఏపీ సీఎం జగన్ తో సమావేశం అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. దుర్గగుడి నుంచి నేరుగా తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి చేరుకున్నారు కేసీఆర్. ఆయన వెంట కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమారు, సీనియర్ నేత వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. జగన్ ఎదురొచ్చి కేసీఆర్ బృందానికి సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత అందరూ కలిసి లంచ్ చేశారు. ఆ తర్వాత తాజా రాజకీయాలు, విభజన సమస్యలపై కేసీఆర్, జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. 9,10 షెడ్యూళ్లలోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన, విద్యుత్ ఉద్యోగుల పంపకాలు, నీటి వివాదాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలంటూ జగన్ ను ఆహ్వానించారు కేసీఆర్. ఈనెల 21 జరగబోయే కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ సర్కారు. జగన్ తోపాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫడ్నవీస్ ను కూడా ఇప్పటికే ఆహ్వానించారు కేసీఆర్. లంచ్ తర్వాత తాజా రాజకీయాలు, విభజన సమస్యలపై కేసీఆర్, జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.

అంతకుముందు దుర్గగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆయన వెంట కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు.. కేసీఆర్ బృందానికి వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆహ్వాన పత్రికను అమ్మవారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయమండపంలో వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.

Tags

Next Story