మావాళ్ళు జంక్‌ ఫుడ్‌ తిని కడుపు నింపుకోవడంలో బిజీ : పాక్‌ ఫ్యాన్స్‌

మావాళ్ళు జంక్‌ ఫుడ్‌ తిని కడుపు నింపుకోవడంలో బిజీ : పాక్‌ ఫ్యాన్స్‌

భారత్‌పై పాక్‌ ఘోర ఓటమిని మూటగట్టుకోవడంతో సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ ఊపందుకున్నాయి. ఏకంగా పాక్‌ అభిమానులే తమ జట్టుకు సోషల్‌ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు. గెలుపుతో ఓ వైపు భారత అభిమానులు పండగ చేసుకుంటుండగా.. పాక్‌ అభిమానులు మాత్రం తమ జట్టు పేలవ ప్రదర్శనను విమర్శిస్తూ సోషల్‌ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ పాక్‌ అభిమాని రియాక్షన్‌ ట్విటర్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది.

భారత్‌ విజృంభించడం చూశాక వర్షం వచ్చి మ్యాచ్‌ ఆగిపోవాలని కోరుకున్నామని... కానీ వరుణ దేవుడు కూడా తమపై దయ చూపలేదంటూ ఓ పాక్‌ అభిమాని ఓ మిడియా ప్రతినిధి ముందు వాపోయాడు. మా టీం తిండి తినడం మీద చూపే శ్రద్ధలో కొంతైనా ఫిట్‌నెస్‌, క్రమశిక్షణ మీద చూపిస్తే బాగుండేదని సెటైర్లు వేశాడు. రేపు మ్యాచ్‌ ఉందంటే.. తమ వాళ్లు ఫిట్‌నెస్‌ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా.. జంక్‌ ఫుడ్‌ తిని కడుపు నింపుకోవడంలో బిజీగా ఉంటారంటూ ఆ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు సదరు పాక్‌ అభిమాని. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Tags

Next Story