సాయి పల్లవి.. చైతూ చెట్టాపట్టాల్..

సాయి పల్లవి.. చైతూ చెట్టాపట్టాల్..

ఫిదా బ్యూటీ సాయిపల్లవిని తెలుగు వారికి దగ్గర చేసిన ఘనత దర్శకుడు శేఖర్ కమ్ములకు దక్కుతుంది. భానుమతిగా అదరగొట్టేసిన సాయిపల్లవితో మరో ప్రాజెక్టుకు రెడీ అవుతున్నారు శేఖర్. ఓ ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్న ఆయన ఆ సినిమాకు 3 నెలలు గ్యాప్ వచ్చింది. దాంతో తన దృష్టిని మరో కొత్త ప్రాజెక్టు వైపు మళ్లించారు. ఇందులో హీరో హీరోయిన్లుగా సాయిపల్లవిని, అక్కినేని నాగచైతన్యను తీసుకోనున్నట్లు సమాచారం. ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునే చిత్రాలు తీసే దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ములనుంచి మరో చిత్రం వస్తుందంటే ఆ చిత్రంపై భారీ అంచనాలే ఉంటాయి ప్రేక్షకుల్లో.

Tags

Read MoreRead Less
Next Story