శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ శర్మ
కృష్ణా తీరం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్ష వైభవంగా జరుగుతోంది. ఉత్తరాధికారిగా బాలస్వామి కిరణ్ కుమార్ శర్మ సన్యాస స్వీకార మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది.. శారాదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన బాలస్వామి కిరణ్ కుమార్ శర్మకు స్వాత్మానందేంద్ర స్వామిగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఇద్దరూ స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వాత్మానందేంద్ర స్వామికి తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ కిరీఠధారణ చేశారు...ఆ తర్వాత ఇద్దరూ స్వరూపానందేంద్ర స్వామి పక్కనే కూర్చున్నారు. గత 3 రోజులుగా ఆధ్యాత్మిక పవనాలతో శోభిల్లింది కృష్ణా తీరం. సన్యాసాశ్రమ దీక్షను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు నిర్వహించారు... ఈ మహోత్సవం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేద పండితులు తరలివచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com