ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ ఎంపీ వీరేంద్రకుమార్‌

ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ ఎంపీ వీరేంద్రకుమార్‌

బీజేపీ ఎంపీ వీరేంద్రకుమార్‌ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. వీరేంద్ర కుమార్‌ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ముందుగా ప్రధాని మోదీ, కేబినెట్‌ మంత్రులు, ప్యానల్‌ ఛైర్మన్లు ఎంపీలుగా ప్రమాణం చేయనుండగా... ఆ తర్వాత ఆల్ఫాబెట్‌ ఆర్డర్‌లో రాష్ట్రాల వారీగా ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తారు. ఎంపీల్లో మొదట అండమాన్‌ నికోబార్‌ ఎంపీ.. ఆ తర్వాత రెండో స్థానంలో ఏపీ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Tags

Next Story