జబర్ధస్త్ షోలో ఇకపై అనసూయ..!!

షో చేస్తున్న నటులతో పాటు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న యాంకర్లు రష్మీ, అనసూయ.. జడ్జిలుగా వ్యవహరిస్తున్న వారు.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ షోకి ప్లస్ పాయింటే. అందుకే అంతగా సక్సెస్ అయింది. చిట్టి పొట్టి డ్రస్‌లు వేసుకుని చలాకీగా మాట్లాడుతూ బుల్లితెర ప్రేక్షకులను అలరించే అనసూయ ఇకపై జబర్ధస్త్ షో చేయదనే వార్తలు వినిపిస్తున్నాయి. రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి అభిమానుల లిస్ట్‌ని పెంచుకున్న అనసూయకు వరుస ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయి. ప్రస్తుతం 'కథనం' అనే చిత్రంలో నటిస్తోంది. ఇంకా పలు చిత్రాలకు సైన్ చేసి ఉందట. సో.. అనూ బాగా బిజీ అయిపోయింది. ఈ తరుణంలో జబర్ధస్త్ షోకి కాల్షీట్లు అడ్జెస్ట్ చేయలేకపోతోందట. అందుకే జబర్ధస్త్‌కి అనసూయ గుడ్‌బై చెప్పనుందని సమాచారం. మరి నవ్వించి, కవ్వించే యాంకర్ అనసూయ లేకపోతే షో ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com