ఆంధ్రప్రదేశ్

ఆస్పత్రిపై దుండగుల దాడి.. భయంతో పరుగులు తీసిన రోగులు

ఆస్పత్రిపై దుండగుల దాడి.. భయంతో పరుగులు తీసిన రోగులు
X

సార్వత్రిక ఎన్నికల్లో బెట్టింగ్ వ్యవహారం రచ్చ రాజేసింది. గంటూరు జిల్లా నరసరావుపేటలో శ్రీ కార్తీక ఆస్పత్రికపై దాడికి పాల్పడ్డారు దుండగులు. ఈ దాడిలో ఇద్దరు డాక్టర్లకు గాయాలయ్యాయి. ఆస్పత్రి ఫర్నించర్ ధ్వంసం అయ్యింది. గాయపడిన డాక్టర్లను ఏరియా ఆస్పత్రికి తరలించారు.

గత ఎన్నికల్లో గెలుపోటములపై జోరుగా బెట్టింగ్ నడిచింది. డాక్టర్ వీరవల్లి రమ్య తండ్రి కూడా బెట్టింగ్ పెట్టాడు. అయితే..బెట్టింగ్ డబ్బులు ఇవ్వకుండా మొహం చాటేశాడు. దీంతో దుండగులు శ్రీ కార్తీక ఆస్పత్రిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు భయంతో పరగులు తీశారు.

Next Story

RELATED STORIES