ఆగస్టు 15 వరకు హైదరాబాద్‌లో ..

ఆగస్టు 15 వరకు  హైదరాబాద్‌లో ..

వ‌ర్షకాల సీజ‌న్‌తో పాటు ఆక‌స్మికంగా సంభ‌వించే విప‌త్తుల‌ను ఎదుర్కొనేందుకు GHMC సిద్ధమైంది. ఆగస్టు 15 వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని రకాల హోర్డింగ్స్‌ను నిషేధించింది. విప‌త్తుల నివార‌ణకు ప్రత్యేక‌ బృందాలు రెడీ చేసింది. నగరంలోని 195 కేంద్రాల‌ను నీటిముంపు ప్రాంతాలుగా గుర్తించి చర్యలు చేపట్టింది GHMC.

వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలకు GHMC సన్నద్ధం అవుతోంది. జలమండలి, విద్యుత్, మెట్రో, ట్రాఫిక్, ఫైర్, పోలీస్ ఇలా మొత్తం 7 శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ టీo లను మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. అన్ని విభాగాల క‌లిపి దాదాపు 493 విప‌త్తుల నివార‌ణకు ప్రత్యేక‌ బృందాలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 600 శిథిల భవనాలను కూల్చి వేశామని వెల్లడించారు. గ్రేట‌ర్ ప‌రిధిలో ప్రధానంగా 195 నీటిముంపు ప్రాంతాలుగా గుర్తించింది. వీటిపై ప్రత్యేక దృష్టిని సాధిస్తున్నట్లు మేయర్‌ తెలిపారు.

ఆగస్టు 15 వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని రకాల హోర్డింగ్‌లను నిషేధిస్తూ జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రస్తుత వ‌ర్షకాల సీజ‌న్‌తో పాటు ఆక‌స్మికంగా సంభ‌వించే విప‌త్తుల‌ను ఎదుర్కొనేందుకు వివిధ శాఖ‌లు మ‌రింత స‌మ‌న్వయంతో ప‌నిచేయాల‌ని ఆధికారులను ఆదేశించింది. వ‌ర్షాకాలంలో ఈదురుగాలులతో కూడిన వ‌ర్షాలు కురిసి హోర్డింగ్‌లు, యూనిఫోల్స్ కూలిపోయి ప్రమాదం జ‌రిగే అవ‌కాశం ఉన్నందున యూనిపోల్స్‌, హోర్డింగ్‌లను నిషేధిస్తున్నట్టు తెలిపింది.

నగరంలోని మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్‌ల‌ను మ‌రోసారి త‌నిఖీలు నిర్వహించి ఆయా నాలాల్లో ఏవిధ‌మైన పూడిక‌, వ్యర్థాలు లేకుండా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని సంబంధిత అధికారులకు జీహెచ్‌ఎంసీ అదేశించింది. హైద‌రాబాద్ మెట్రో రైలు మార్గంలో 95 హోర్డింగ్‌లు ప్రమాద‌క‌రంగా ఉన్నాయ‌ని వాటన్నింటిని తొల‌గించాల‌ని సంబంధిత ఏజెన్సీల‌ను ఆదేశించామ‌ని అధికారులు తెలిపారు. రోడ్లు త‌వ్వి పున‌రుద్దర‌ణ చేయ‌ని ఏజెన్సీల‌పై చ‌ర్యలు చేప‌ట్టనున్నట్టు స్పష్టం చేశారు. మొత్తానికి విపత్తులపై ముందస్తు చర్యలు చేపట్టిన GHMC .. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు రానివ్వబోమని భరోసా ఇస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story