ఎదురుగా వచ్చి పోరాడండి.. దొంగచాటుగా కాదు: జేసీ ప్రభాకర్‌ రెడ్డి

ఎదురుగా వచ్చి  పోరాడండి.. దొంగచాటుగా కాదు: జేసీ ప్రభాకర్‌ రెడ్డి

అనంతపురం జిల్లాలో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. అయితే ఈ సారి మనుషులపై కాకుండా చీనీ చెట్లపై ప్రతాపం చూపారు ప్రత్యర్థులు. పుట్లూరు మండలం చిన్నమల్లేపల్లి టీడీపీ నేత చంద్రశేఖర్‌నాయుడుకు చెందిన 55 చీనీ చెట్లను ప్రత్యర్థులు నరికివేశారు. వీటి వయసు రెండు సంవత్సరాలు. తెల్లవారు జామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్టు తెలిపారు బాధితులు. విషయం తెలుసుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేడీ ప్రభాకర్‌రెడ్డి చీనీ తోటను పరిశీలించారు. సమస్యలుంటే ఎదురుగా పోరాడాలికాని ఇలా చెట్లు నరకడం దారుణమన్నారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి. చెట్లను నరికే ఈ సంస్కృతిని పరిచయం చేసింది పూట్లూరు మండలమే కావడం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story