బ్యానర్‌ చిరిగింది..పెళ్లి ఆగింది

బ్యానర్‌ చిరిగింది..పెళ్లి ఆగింది

ఓ బ్యానర్‌ వివాదం ఎంత పనిచేసింది. ఏకంగా పెళ్ళి ఆగిపోయేలా చేసింది. తమిళనాడు చేపాక్కం గ్రామానికి చెందిన పెరియస్వామికి శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. ఈ వివాహం సందర్భంగా స్నేహితులు ఇంటి ముందు బ్యానర్‌ ఏర్పాటు చేశారు. అయితే ఈ బ్యానర్‌ను అదే గ్రామానికి చెందిన చిన్నదురై కుమారులు మణికంఠన్‌, శివ ఇరువురు చింపివేశారు. దీంతో ఆగ్రహించిన పెరియస్వామి వారితో గొడవకు దిగాడు. ఈ సమయంలోనే వధువు బంధువు ఒకరు మృతి చెందినట్లు సమాచారం వచ్చింది. బ్యానర్ గొడవ, మరణ వార్త విన్న వధువు ఇంటి వారు శకునం సరిగా లేదని చెప్పి వివాహాన్ని ఆపివేసి ఇంటికి వెళ్లిపోయారు. దీంతో కోపొద్రిక్తుడైన పెరియస్వామి తన వివాహం ఆగిపోవడానికి ఆ ఇద్దరు యువకులే కారణమని వేప్పూర్‌ పోలీసు స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి మణికంఠన్, శివను అరెస్టు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story