18 Jun 2019 3:36 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / ఫెడరల్ కోర్టు భవనంలో...

ఫెడరల్ కోర్టు భవనంలో కాలేజీ స్టూడెంట్ కాల్పులు..

ఫెడరల్ కోర్టు భవనంలో కాలేజీ స్టూడెంట్ కాల్పులు..
X

అమెరికాలోని డల్లాస్ ఫెడరల్ కోర్టు భవనంలో ఓ అగంతకుడు కాల్పులకు తెగబడ్డారు. ముగుసు వేసుకున్న ఓ యువకుడు తుపాకితో కాల్పులు జరుపడంతో ఒకరు మరణించారు. మరొకరు గాయపడ్డారు. అగంతకుడు 22 ఏళ్ల కాలేజీ విద్యార్ధిగా పోలీసులు గుర్తించారు. అయితే కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. అయితే కాల్పులు జరిగిన సమయంలో కోర్టు హాల్ లో దాదాపు 3వందల మంది ఉద్యోగులు ఉన్నారు. కాల్పులకు తెగబడుతున్న దృష్యాలు ఓ మీడియా రిపోర్టర్ కెమెరాకు చిక్కాయి. విద్యాసంస్థలో మోసానికి పాల్పడ్డ వ్యక్తి ఫోటోను తీసేందుకు అతను కోర్టుకు వచ్చాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ కాల్పుల ఘటనను అతను షూట్ చేసి నింధితుడి ఫోటోను అధికారులకు అందించాడు.

Next Story