క్రిమినల్ కేసులో నిందితుడిని తప్పించేందుకు లంచం..

క్రిమినల్ కేసులో నిందితుడిని తప్పించేందుకు లంచం..

క్రిమినల్ కేసులో నిందితుడిని తప్పించేందుకు లంచం తీసుకుంటూ బొల్లారం ఎస్ఐ బ్రహ్మచారి రెడ్ హ్యాండెడ్‌గా ACBకి పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ పేరుతో ఓవ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేశారు. కానీ బెయిల్ ఇవ్వకుండా మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు ఎస్సై. బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఎస్సైని అదుపులోకి తీసుకున్నారు.

ఫ్రైండ్లీ పోలీసింగ్ అని చెప్పుకుంటున్న పోలీసులు చేతల్లో చూపించడంలేదు.. జనం నుంచి ముక్కు పిండి లంచాలు వసూలు చేస్తూ చేతివాటం చూపిస్తున్నారు.. హైదరాబాద్‌లోని బొల్లారం పోలీస్ స్టేషన్‌ ఎస్సై సాక్షాధారాలతో సహా పట్టుబడడం దీనికి అద్దం పడుతోంది. స్టేషన్ బెయిల్ పేరుతో ఓవ్యక్తి నుంచి 20వేల నగదును వసూలు చేశారు సిబ్బంది. అయితే ఎస్సై బ్రహ్మచారి బెయిల్ ఇవ్వకుండా మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. వారం రోజులుగా సమాచారం సేకరించిన ఏసీబీ .. చివరకు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎస్సై బ్రహ్మచారితోపాటు సిబ్బందిని విచారించి వారిని అదుపులోకి తీసుకుంది. బాధితుడితో డీల్‌ మాట్లాడుతున్న కానిస్టేబుల్, ఎస్సై ఫోన్‌ సంభాషణను టీవీ5 సంపాదించి బయట పెట్టింది.

బొల్లారం ఆదర్శనగర్‌కు చెందిన జనగాం నర్సింగ్‌రావు తన వద్ద పనిచేసే గోపీ అనే వ్యక్తితో గోడవ జరిగింది. ఈ కేసులో పోలీసు విచారణకు హాజరు కాకుండా ముందస్తు బెయిల్‌కు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలంటే రూ. 20వేలు ఇవ్వాల్సిందేనని నర్సింగ్‌రావుతో కానిస్టేబుల్‌ నగేష్‌ ద్వారా ఎస్‌ఐ బ్రహ్మచారికి రాయబారం నడిపాడు. బెయిల్‌ నిమిత్తం తొలుత కానిస్టేబుల్ నగేష్.. నర్సింగ్‌రావు ఇంటికి వెళ్లి ఆయన భార్య అంభికా వద్ద రూ.10వేల నగదును తీసుకున్నారు.. మిగతా నగదు ఫోన్‌ పే ద్వారా బదిలీల చేసింది. డబ్బులు ఇచ్చినా స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వకుండా, కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుండడంతో నగర ఏసీబీని ఆశ్రయించారు..

రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సీసీ కెమెరాల రికార్డుతో పాటు ఫోన్‌లోని వాట్సాప్, ఆడియోలను పరిశీలించి, పూర్తి ఆదారాలతో బొల్లారం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐ బ్రహ్మచారి, కానిస్టేబుల్‌ నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. లంచగొండి పోలీసులను కఠినంగా శిక్షించాలని ACBకి ఫిర్యాదు చేసిన అంబిక కోరుతున్నారు...

Tags

Read MoreRead Less
Next Story