అరుదైన రికార్డ్ అందుకున్న బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌

అరుదైన రికార్డ్ అందుకున్న బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌

వెస్టిండీస్‌పై అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ అరుదైన రికార్డ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆరువేల పరుగులు పూర్తి చేయడం ద్వారా వన్డేల్లో ఆరువేల రన్స్‌, 250 వికెట్లు పడగొట్టిన నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అతడికన్నా ముందు శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ సనత్‌జయసూర్య, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలీస్‌, పాకిస్థానీ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిదీ ఈ ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో షకీబుల్ సెంచరీ చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అలాగే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా ఉన్న ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫింఛ్‌ను వెనక్కి నెట్టి షకిబ్ తొలిస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం షకీబుల్ 384 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story