టీడీపీ వ్యాఖ్యలపై స్పీకర్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. మొత్తం ఐదురోజులపాటు సమావేశాలు జరిగాయి. సభ 19 గంటల 25 నిమిషాలు నడిచింది.. తొలి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం, స్పీకర్ ఎంపిక జరిగాయి. అనంతరం గవర్నర్ ప్రసంగంపై చర్చ జరిగింది. చివరిరోజు డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.. ఆ తర్వాత జగన్ ప్రత్యేక హోదా పై తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఇదే అంశంపై అసెంబ్లీ వాడివేడిగా సాగింది. ప్రతిపక్షం, అధికార పక్షాల పరస్పర ఆరోపణలతో సభ హీటెక్కింది.
అసెంబ్లీని స్పీకర్ నడిపించడం లేదని.. సీఎం జగనే నడిపిస్తున్నారన్న టీడీపీ ఆరోపణలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇరు పక్షాలు సమానమేనని చెప్పారు. చైర్ కు ఎలాంటి దురుద్దేశాలు ఆపాదించొద్దని అన్నారు స్పీకర్ తమ్మినేని.
చంద్రబాబు వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని ఆరోపించారు సీఎం జగన్. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్లానింగ్ కమిషన్‌కు ఒక్కసారి కూడా లేఖ రాయలేదని ఆరోపించారు. గట్టిగా ప్రయత్నించి ఉంటే స్పెషల్ స్టేటస్ ఎప్పుడో వచ్చేదని జగన్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com