రిలాక్స్ అవుతోన్న టీమిండియా.. మేనేజ్మెంట్ సంచలన నిర్ణయం

ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై గ్రాండ్ విక్టరీ అందుకున్న టీమిండియా ఇప్పుడు రిలాక్స్ అవుతోంది. మరో రెండు రోజుల పాటు ఆటగాళ్ళు విహారం చేయొచ్చు. టీమ్ ప్రాక్టీస్ సెషన్స్‌ను రెండు రోజుల పాటు రద్దు చేస్తూ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. అలాగే తమ కుటుంబాలతో కలిసి టూర్ కొనసాగించే అవకాశం కూడా త్వరలోనే రానుంది.
ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర అంచనాలకు తగ్గట్టే సాగుతోంది. టోర్నీ ఫస్టాఫ్‌లోనే టాప్ టీమ్స్‌తో మ్యాచ్‌లు ఉండడంతో భారత్ ఎలా ఆడుతుందో అని చాలా మంది అభిమానులు టెన్షన్ పడ్డారు. అయితే టైటిల్ ఫేవరెట్ రేసులో ముందున్న కోహ్లీసేన అంచనాలకు తగ్గట్టే ఆడుతూ వరుస విజయాలతో సత్తా చాటింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలపై విజయాలు సాధించిన భారత్.. టోర్నీలోనే అత్యంత క్రేజ్ ఉన్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది.
ప్రస్తుతం ఆటగాళ్ళు తమ వరుస విజయాలను ఆస్వాదిస్తున్నారు. అటు జట్టు ప్రదర్శన కూడా నిలకడగా ఉండడంతో మేనేజ్మెంట్ ఆటగాళ్ళకు రెండురోజులు హాలిడే ఇచ్చింది. ప్రాక్టీస్ సెషన్స్‌కు దూరంగా విహారానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెండురోజుల పాటు ఆటగాళ్ళంతా ఇంగ్లాండ్‌ను చుట్టేయబోతున్నారు. టోర్నీలో పెద్ద జట్లపై వరుసగా రెండు విజయాలు అందుకున్న కోహ్లీసేన.. కీలకమైన పాక్ పోరులోనూ అదరగొట్టడంతోనే మేనేజ్మెంట్ ఈ రిలాక్సేషన్‌కు పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి తోడు ప్రపంచకప్ ప్రారంభమైన తొలి 20 రోజులూ ఆటగాళ్ళ భార్య లేదా గాళ్‌ఫ్రెండ్స్‌ను కలవడానికి వీల్లేదని బీసిసిఐ ముందే నిర్ణయించింది. ఇప్పుడు ఆ గడువు కూడా ముగిసిపోనుండడంతో క్రికెటర్లంతా తమ కుటుంబాలతో కలిసి మిగిలిన టోర్నీ ఫినిష్ చేయబోతున్నారు.
లీగ్ స్టేజ్ ఫస్టాఫ్‌లో పెద్ద జట్లతో మ్యాచ్‌లు ఉండడం, కీలకమైన పాక్‌తో పోరుకు ముందు ఎటువంటి విమర్శలు లేకుండా ఉండేందుకే బోర్డు గాళ్‌ఫ్రెండ్స్‌ను అనుమతించలేదని తెలుస్తోంది. ఇప్పుడు తర్వాత జరగబోయే మ్యాచ్‌లలో ఎక్కువ శాతం చిన్న జట్లతోనే ఉండడంతో ఆటగాళ్ళకు కొంత వెసులుబాటు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే రెండురోజుల పాటు ఇంగ్లాండ్‌లో తాము నచ్చిన చోట తిరిగేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడబోతోంది. ఈ మ్యాచ్‌కు ముందు ఎక్కువ రోజులు విరామం ఉండడంతో ఆటగాళ్ళు రిలాక్స్ అవ్వడమే మంచిదని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com