టిక్‌టాక్‌ వీడియో కోసం గాల్లో పల్టీ కొట్టిన యువకుడు.. చివరకు..

టిక్‌టాక్‌ వీడియో కోసం గాల్లో పల్టీ కొట్టిన యువకుడు.. చివరకు..

టిక్‌టాక్‌ వీడియో సరదా.. ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. కర్నాటకలోని తుమ్కూరుకు చెందిన శివస్వామి అనే యువకుడు స్నేహితుడి సాయంతో గాల్లో పల్టీ కొట్టి... ఆ వీడియో టిక్‌టాక్‌లో పోస్ట్ చేయాలనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆ ప్రయోగం వికటించింది.

గాల్లోకి ఎగిరిన స్వామి... ల్యాండింగ్‌ మాత్రం సరిగా చేయలేకపోయాడు. ఆయన మెడ నేలను బలంగా తాకింది. దీంతో ఆయన మెడ భాగం విరిగిపోయింది. వెంటనే స్నేహితులు అతణ్ని ఆస్పత్రికి తరలించారు.

టిక్‌టాక్‌ల పేరుతో యువకులు ఇలాంటి డేంజరస్‌ ఫీట్లు చేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. అంతా అనుకున్నట్లు జరిగితే పర్వాలేదు కానీ.. ఏదైనా అపశృతి దొర్లితే మాత్రం.. శివస్వామిలా ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సి వస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story