ఊళ్లోకి ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు రానివ్వం.. గ్రామస్తుల తీర్మానం

ఊళ్లోకి  ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు రానివ్వం.. గ్రామస్తుల తీర్మానం

ప్రైవేటు స్కూల్‌ బస్సులు తమ గ్రామంలో రాకుండా అడ్డుకున్నారు రాజన్న సిరిసిల్లా జిల్లాలోని పోత్గల్‌ గ్రామస్తులు. ప్రైవేట్‌ బస్సులు ఊళ్లోకి రాకుండా ఇప్పిటికా ఆ గ్రామం పంచాయతీ తీర్మానం చేసింది. ఒక వేళ తమ తీర్మానానికి వ్యతిరేకంగా ఊళ్లోకి ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు వస్తే దాన్ని అడ్డుకుంటున్నారు. ఇది తెలియకుండా... ఇవాళ ఓ బస్సు ఊళ్లోకి వచ్చింది. అయితే దాన్ని గ్రామ సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు.....

పంచాయతీ తీర్మానికి వ్యతిరేకంగా ఊళ్లోకి ఎలా బస్సును తీసుకొస్తావంటూ డ్రైవర్‌ను నిలిదీశారు. ఆ స్కూల్‌ యాజమాన్యం రావాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో డ్రైవర్‌ ఆ బస్సులోను గ్రామ సరిహద్దుల్లోని నిలిపేశాడు.ఇప్పటికే ఉమ్మడి కరీంగనర్‌ జిల్లాలోని కొన్ని గ్రామాలు ఇలాంటి తీర్మానాలే చేసుకుంటున్నారు. అయితే.. పోత్గల్‌ గ్రామస్తులు మాత్రం ఓ అడుగు ముందుకేసి ఏకంగా... ప్రైవేట్‌ బస్సును అడ్డుకోవడంతో అక్కడ కలకలం ఏర్పడింది..

Tags

Read MoreRead Less
Next Story