టీవీ ఛానళ్లకు హెచ్చరిక

టీవీ ఛానళ్లకు, కేంద్రం హెచ్చరిక జారీచేసింది. గత కొన్నేళ్లుగా ఛానెళ్లలో రియాల్టీ షోలు, డ్యాన్స్ షోలు ఎక్కువైపోయాయి. రేటింగ్స్ కోసం షో నిర్వాహకులు చేసే ప్రయత్నాలు శృతి మించి పోతున్నాయి. ముఖ్యంగా డాన్స్ షోలలో పిల్లలను పొట్టి పొట్టి డ్రెస్సులతో అసభ్యంగా చూపిస్తున్న సంఘటనలు ఎక్కువయ్యాయి. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. కష్టసాధ్యమైన డాన్స్‌లను పిల్లలతో చేయించి ఎలాగైనా గెలవాలంటూ వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని చైల్డ్ యాక్టివిస్ట్‌లు ఆరోపిస్తున్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీవీ రియాల్టీ షోలపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ టీవీ ఛానల్స్‌కు కొన్ని ప్రత్యేక మార్గ దర్శకాలను జారీ చేసింది. పిల్లలను అనుచితంగా చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కేబుల్ చట్టం-1995 ప్రకారం ఛానళ్లు నిబంధనలను పాటించాలని ఆ ప్రకటనలో తెలిపింది. రియాల్టీ షోలలో ఎలాంటి అసభ్యకరమైన భాష కానీ, కఠినతరమైన సన్నివేశాలను చూపించరాదని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com