క్రైమ్

మరిది మీద వాంఛతో దారుణానికి ఒడిగట్టిన మహిళ

మరిది మీద వాంఛతో దారుణానికి ఒడిగట్టిన మహిళ
X

బరితెగించిన కామం ఆమె కళ్లు మూసింది. కొడుకులాంటి మరిదిపై ఆమె పెంచుకున్న ప్రేమ పగగా మారి హత్యకు దారితీసింది. దీంతో ఓ మానసిక వికలాంగురాలు ప్రాణం పోయింది. విజయవాడ సనత్ నగర్ కు చెందిన ముంతాజ్, ఖలీల్ వదిన - మరిది వరస అవుతారు. అతనికి పదేళ్లు ఉన్నప్పుడు ముంతాజ్ ఖలీల్ అన్నను పెళ్లి చేసుకుంది. అయితే.. కొన్నాళ్ల తర్వత ఖలీల్ ను లోబర్చుకుంది ముంతాజ్. కొన్నేళ్ల పాటు ఈ అక్రమ సంబంధం కొనసాగింది.

ముంతాజ్ భర్త ముఠా పని చేస్తుంటాడు. అతను వెళ్లిపోగానే ముంతాజ్ బరితెగింపు చేష్టలు మొదలయ్యేవి. పాపం పండి ఓ రోజు ఆమె వ్యవహారం బయటపడింది. దీంతో కుటుంబ పెద్దలు ఇరువుర్ని మందలించారు. అయినా..మార్పు రాలేదు. దీంతో ఖలీల్ కు పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత ఖలీల్, ముంతాజ్ ను పట్టించుకోకపోవటంతో ఆమె ప్రేమ కాస్త పగగా మారిపోయింది. ఖలీల్ పక్కన మరొకర్ని ఊహించుకోలేకపోయింది. ఎలాగైన ఖలీల్ భార్య అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయిన ముంతాజ్ మర్డర్ కు ప్లాన్ రెడీ చేసుకుంది.

బుధవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఓ మగ్గు నిండా పెట్రోల్ తీసుకొని పక్కనే ఉన్న మరిది ఇంట్లోకి వెళ్లింది. ఖలీల్ భార్య అనుకొని మానసిక వికలాంగురాలైన ఆడపడుచు మీద పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయింది. మంటల్లో పూర్తిగా కాలిపోయిన మానసిక వికలాంగురాలు చనిపోయింది. ఖలీల్ 70 శాతాం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహేతర సంబంధం కారణంగానే ముంతాజ్ ఈ దారుణానికి ఒడిగట్టిందని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES