సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం

By - TV5 Telugu |19 Jun 2019 1:34 PM GMT
కాంగ్రెస్ నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని హస్తం నాయకత్వం రద్దు చేసింది. కేపీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిండెంట్లను మాత్రం కొనసాగించారు. మిగతా పదవులన్నింటినీ రద్దు చేశారు. కర్ణాకటలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేపీసీసీ ధోరణితో విసుగు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఏకంగా కేపీసీసీని రద్దు చేయడం విశేషం.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com