దివ్యాంగుడిని ప్రేమించిందని చెల్లెలిపై కత్తితో దాడి చేసిన అన్నయ్య

దివ్యాంగుడిని ప్రేమించిందని చెల్లెలిపై కత్తితో దాడి చేసిన అన్నయ్య

కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణమైన ఘటన జరిగింది. చెల్లెలు ఓ దివ్యాంగుడిని ప్రేమిస్తోందన్న కారణంగా అన్న ఆమెపై దాడి చేశాడు. కత్తితో విచక్షణారహితంగా నరకడంతో ఆమె మెడ, చేతి వేళ్లు తెగి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు జ్యోతిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది.

నంద్యాల నూనెపల్లికి చెందిన జ్యోతి కొన్నాళ్లుగా ఓ దివ్యాంగుడిని ప్రేమిస్తోంది. అతన్నే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో ఆమెకు నచ్చచెప్పేందుకు పలుమార్లు ట్రై చేసిన అన్నయ్య సుబ్బారాయుడు మాట వినకపోవడంతో దాడి చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story