దారుణం : 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం

దారుణం : 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం

విజయవాడ రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగింది. 8వ నెంబర్‌ ప్లాట్‌ ఫామ్‌ వద్ద ట్రాక్‌పై ఓ 70 ఏళ్ల వృద్ధురాలు.. రక్తపు మడుగులో.. వివస్త్రగా పడి ఉంది. ఇది గుర్తించిన రైల్వే పారిశుద్ధ్య కార్మికులు.. 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలి మెడ, ఛాతి, మర్మాంగం నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో.. ఐదుగురు అత్యాచారయత్నం చేశారని పోలీసులు భావిస్తున్నారు. బ్లేడ్‌ బ్యాచ్‌, గంజాయి బ్యాచ్‌ పనిగా అనుమానిస్తున్నారు. అత్యాచారం జరిగిందా లేదా డబ్బు కోసం దాడికి తెగబడ్డారా అన్న కోణంలో విచారిస్తున్నరు. బాధిత వృద్దురాలు ఎండు చేపలు అమ్ముకుని జీవిస్తున్నట్లు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story