ప్రపంచకప్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ

ప్రపంచకప్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ

ప్రపంచకప్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఓపెనర్ శిఖర్ ధావన్ మొత్తం టోర్నీకే దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ధావన్ వేలికి గాయమైంది. దీంతో పాక్‌తో మ్యాచ్‌కు కెఎల్ రాహుల్ ఓపెనర్‌గా వచ్చాడు. ముందు జాగ్రత్తగా రిషబ్ పంత్‌ను స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపిక చేసినప్పటకీ...ధావన్ గాయంపై టీమ్ మేనేజ్‌మెంట్ కొన్ని రోజులు వేచి చూడాలని నిర్ణయించింది. అయితే ధావన్ గాయం తీవ్రత ఎక్కువగానే ఉండడంతో ఆరు వారాల కంటే ఎక్కువే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో టోర్నీ నుంచి వైదొలగక తప్పలేదు. ధావన్ స్థానంలో ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోనే ఉన్న రిషబ్ పంత్ జట్టుతో కలవనున్నాడు. టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌లో శనివారం ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది.

Tags

Read MoreRead Less
Next Story