పెళ్లయిన 4 నెలలకే డెలివరి... టీచర్‌పై వేటు!
ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ వివాహం జరిగిన నాలుగు నెలలకే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ కారణంగా కొన్ని నెలలు ఆమె బడికి సెలవు పెట్టింది.ప్రసూతి సెలవులనంతరం తిరిగి ఉద్యోగంలో చేరేందుకు ప్రయత్నించగా..తోటి ఉపాధ్యాయులు అందుకు నిరాకరించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
సెలవుల అనంతరం తను విధుల్లోకి చేరుందుకు బడికి వెళ్లగా పిల్లల పెరెంట్స్-టీచర్స్ అడ్డుకుని తీవ్రంగా దూషించారని ఫిర్యాదు చేశారు.ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన కేరళలోని కొట్టక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది.
కొట్టక్కల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూల్‌లో ఐదేళ్లుగా టీచర్‌గా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు భర్తతో ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంది. నాలుగు నెలల క్రితం ఆమె మరో వివాహం చేసుకున్నారు. ఆ టీచర్ రెండో పెళ్ళి గతంలోనే చేసుకోవాలి అనుకున్నప్పటికీ మెుదటి భర్తతో విడాకుల కారణంగా ఆలస్యం జరిగింది. ఏడాది కాలంగా చట్టబద్ధంగా విడాకులు వచ్చే వరకు వేచి చూశారు. ఈ విడాకుల పక్రియ జరుగుతున్న క్రమంలోనే 2018 నుంచి ఆమె మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం మెుదటి భర్తతో డైవర్స్ రావడంతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో పెళ్లయ్యే నాటికే గర్భం దాల్చారు. తర్వాత పెళ్లయిన నాలుగు నెలల తర్వాత బిడ్డను ప్రసవించారు. ప్రసూతి సెలవులు అనంతరం ఆమె తిరిగి పాఠశాలలో చేరేందుకు ప్రయత్నించగా.. అధికారులు అందుకు అంగీకరించలేదు. దీంతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com