ఆంధ్రప్రదేశ్

టీడీపీకి గుడ్ బై చెప్పిన నలుగురు రాజ్యసభ సభ్యులు..!

తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ముదిరింది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్య సభ సభ్యులు, దాదాపుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు నలుగురు ఎంపీలు CM రమేష్, సుజనా చౌదరి, TG వెంకటేశ్, గరిక పాటి రామ్మోహన్‌ రావులు, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. ఇకపై తమను టీడీపీ ఎంపీలుగా కాకుండా ప్రత్యేక ఎంపీల బృందంగా గుర్తించాలని వెంకయ్యనాయుడును కోరారు. స్థానిక కారణాల వల్లే టీడీపీ నుంచి వెళ్లిపోతున్నామని ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసమే బీజేపీలో చేరాలనుకుంటున్నామని చెప్పారు.

టీడీపీకి రాజ్యసభలో ఆరుగురు ఎంపీలున్నారు. CM రమేష్, సుజనా చౌదరి, TG వెంకటేశ్, గరిక పాటి రామ్మోహన్‌ రావుతో పాటు న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్‌, సీతామాలక్ష్మిలు టీడీపీ నుంచి రాజ్యసభకు ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. ఈ ఆరుగురిలో నలుగురు ఎంపీలు తెలుగుదేశానికి గుడ్ బై చెప్పడంతో పెద్దల సభలో టీడీపీకి ఇద్దరు సభ్యులు మాత్రమే మిగిలారు.

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్ని కల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ ఓటమి ఛాయల నుంచి పార్టీ ఇంకా పూర్తిగా తేరుకోకముందే మరో షాక్ తగిలిం ది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. CM రమేష్, సుజనా చౌదరి, TG వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్‌ రావులు కమలదళంలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు ఆ నలుగురు ఎంపీలు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో చర్చించినట్లు సమాచారం.

Next Story

RELATED STORIES