విశాల్ ను ఉద్దేశించి భారతీరాజా తీవ్ర వ్యాఖ్యలు.. చివరకు..

విశాల్ ను ఉద్దేశించి భారతీరాజా తీవ్ర వ్యాఖ్యలు.. చివరకు..

నడిగర్ సంఘం తమిళ నిర్మాతలదైతే.. అందులో తెలుగువాళ్ల పెత్తనం ఏంటంటూ ప్రశ్నించారు ప్రముఖ దర్శకుడు భారతీరాజా. సీనియర్ దర్శక దిగ్గజం‌ భారతీరాజా నటుడు విశాల్ పై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగటం సంచలనం సృష్టిస్తోంది. నిర్మాతల మండలిలో అధ్యక్షుడిగా విశాల్ వంటి పందికొక్కు దూరిందని, దాన్ని తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు. మండలిలో మొలిచిన కలుపు మొక్కను పీకేయాల్సిన బాద్యత మనందరిపై ఉందన్నారు. తమిళ నిర్మాతల‌ మండలి అద్యక్షుడిగా, నడిగర్ సంఘం కార్యదర్శిగా విశాల్ ఉండగా ఆయన్ను టార్గెట్ చేస్తూ బారతీరాజా వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

నడిగర్ సంఘం తమిళేతరుల చేతిలో నడుస్తుండటం బాధగా ఉందన్నారు. నడిగర్ సంఘానికి జరిగే ఎన్నికల్లో బాగ్యరాజా టీమ్ ను గెలిపించుకోవటం ద్వారానే తమిళ నటుల ఉనికిని కాపాడుకునే అవకాశం ఉందన్నారు. బాగ్యరాజ్ గెలవగానే దక్షిణాది నటీనటుల సంఘాన్ని తమిళ నటుల సంఘంగా మార్చాలని, నడిగర్ సంఘానికి తమిళనటుల సంఘంగా మార్చటమే తన ద్యేయమని బారతీరాజా వ్యాఖ్యనించటం ఇప్పుడు తమిళ చిత్రసీమలో కలకలం సృష్టిస్తుంది.

దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులో సినిమాలకు రాజకీయాలకు, అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ఎంతో మంది నటీనటులు రాజకీయాల్లో ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా తమిళ సినీరంగానికి మరోసారి రాజకీయ సెగ అంటుకుంటోంది. ఇందులో భాగంగానే ఒకరిపై ఒకరు ఘోరమైన వ్యాఖలు చేసుకునే దుస్థితికి తమిళ సినీ ఇండస్ట్రీ దిగజారిపోయింది. తాజాగా తమిళ సినీ నటుల సంఘం ఎన్నికల్లో దూషణలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారా స్థాయికి చేరాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం నడిగర్ సంఘం కార్యదర్శిగా కొనసాగుతున్న విశాల్ నేతృత్వంలోని టీంను ఓడించేందుకు, భాగ్యరాజా ప్యానల్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.ఈ సందర్భంగా భాగ్యరాజా కు సపోర్ట్ చేస్తున్న సీనియర్ దర్శకుడు భారతీరాజా విశాల్ ను విమర్శిస్తూ చేసిన వ్యాఖలు కలకలం రేపుతున్నాయి.

తెలుగువాడైన విశాల్ తమిళ నడిగర సంఘంలో కీలకబాధ్యతలు నిర్వర్తించడం పలువురిని అసంతృప్తికి గురి చేస్తోంది. గతంలో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ ప్యానెల్.. శరత్ కుమార్ ప్యానెల్ తో పోటీకి దిగి గెలిచారు. ఆ సమయంలో శరత్ కుమార్, అతడి భార్య రాధికా.. విశాల్ తెలుగువాడని, అతడి కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. కానీ అవేవీ విశాల్ పై ఎఫెక్ట్ చూపించలేకపోయాయి. ఇప్పుడు మరోసారి ఎన్నికలు దగ్గర పడుతుండడంతో విశాల్ తెలుగోడంటూ కొందరు కోలీవుడ్ ఇండస్ట్రీ సభ్యులు కామెంట్స్ చేస్తున్నారు. విశాల్ ని కలుపు మొక్క అని, పందికొక్కు అంటూ సీనియర్ దర్శకుడు భారతీరాజా చేసినవ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

విశాల్ తమిళ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అతడు తెలుగువాడే.. విశాల్ కుటుంబం కొంతకాలం పాటు హైదరాబాద్ లో నివసించింది. విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణారెడ్డి.. స్క్రీన్ పేరు విశాల్ గా పెట్టుకోవడంతో అదే పేరుతో అందరూ పిలుస్తారు. 1977, ఆగస్ట్ 29న జి.కె.రెడ్డి, జానకి దేవి దంపతులకు విశాల్ జన్మించాడు. అతడి కుటుంబం హైదరాబాద్ లో నివసించే సమయంలో విశాల్ దిల్ షుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నాడట. తరువాత విశాల్ కుటుంబం చెన్నైకి మకాం మార్చారు. దీంతో విశాల్ చదువు మొత్తం చెన్నైలోనే సాగింది. విశాల్ సెకండరీ ఎడ్యుకేషన్ ను చెన్నైలోని డాన్ బాస్కో మెట్రిక్యులేన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పూర్తి చేశాడు. ఆ తరువాత లయోలా కాలేజీ నుండి విజువల్ మీడియాలో డిగ్రీ చేశారు. విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణకి సినిమా రంగంలో సంబంధాలు ఉన్నాయి. దీంతో విశాల్ కి సినిమాల మీద ఆసక్తి పెరిగింది. ఆ విధంగా తమిళ ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయి, తన మార్క్ చూపించాడు.

Tags

Read MoreRead Less
Next Story