కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి గవర్నర్‌ ను ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి గవర్నర్‌ ను ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని గవర్నర్‌ నరసింహన్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరోసారి ఆహ్వానించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమైన కేసీఆర్ పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం, కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన, ఏపీ భవనాల అప్పగింతపై చర్చించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్‌కు తెలియజేశారు. ప్రాజెక్టు వ్యయం , సాగునీరు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి పంపిణీ తదితర అంశాలపై నివేదిక అంజేశారు . కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం 2020తో పూర్తికానుందని, 45 లక్షల ఎకరాలకు 2 పంటలకు సాగునీరు అందుతుందని కేసీఆర్ చెప్పారు.

మరో వైపు సచివాలయం కోసం నూతన భవనాల నిర్మాణం, ఎర్రమంజిల్‌లో నిర్మించనున్న శాసనసభ భవనం, ప్రణాళిక, నమూన గురించి నరసింహన్‌కు కేసీఆర్‌ .. వివరించారు. పురపాలక, రెవెన్యూ చట్టాల్లో మార్పులు, చేర్పులు చేయడంతో పాటు జులైలో ఎన్నికలు నిర్వహించాలన్న దానిపై గవర్నర్‌కు తెలియజేశారు. జూలై చివరి వారంలో నిర్వహించనున్న బడ్జెట్ సమావేశాలపై ఇరువురు చర్చించారు.

అటు హైదరాబాద్‌లోని ఎపీ భవనాలను తెలంగాణకు అప్పగించే అంశంపై గవర్నర్‌తో చర్చించారు సీఎం కేసీఆర్‌. ఈ ప్రక్రియ దాదాపు పూర్తి అయిందిందని వివరించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య స్నేహపూరిత వైఖరితో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు నరసింహన్‌కు తెలియజేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు సమావేశమై గోదావరి జలాల అంశంపై చర్చలు జరపనున్నట్లు చెప్పారు కేసీఆర్‌.

Tags

Read MoreRead Less
Next Story