వెల్లుల్లి వలవడం ఇంత ఈజీనా.. వీడియో వైరల్

ఉల్లి, వెల్లుల్లి వలవడం ఎంత కష్టమో. కనీసం ఉల్లిపాయలన్నా కూరల్లో వేస్తాం కాబట్టి రెండు ముక్కలు చేసి నీళ్లలో వేస్తే వలవడం ఈజీ అవుతుంది. మరి వెల్లుల్లిని నిల్వ పచ్చళ్లలో ఎక్కువ వాడుతుంటారు. వాటికి నీళ్లు తగలకూడదు. వలవడం కూడా కొంచెం కష్టమే. చిన్నగా ఉన్నా పొట్టు తీయడం కష్టం. అదేమంత పెద్ద కష్టం కాదు అని సింపుల్‌గా చెప్పడానికి లేదు. అయితే నేను చూపిస్తాను ఈజీగా వలిచేయండి కిలో అయనా ఒకేసారి అంటూ నెట్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. నిజంగానే భలే ఉంది ఈ వీడియో. నాలుగు రోజుల్లోనే 3 కోట్ల మంది చూసారంటే.. వెల్లుల్లిని ఇంత ఈజీగా వలిచేయొచ్చా అంటున్నారు నెటిజన్స్. కొరియాలో తీసిన ఈ వెల్లుల్లి వీడియో ఇప్పుడు ప్రతి ఇంట్లో సందడి చేస్తోంది. దీనిని క్రిస్సీ టీజెన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ నుంచి అలెక్సాండ్రా ఒకాషియో-కార్టెజ్ చెఫ్ పోస్ట్ చేశారు. మరి మీరూ చూసేయండి. వెల్లుల్లి వలవడం నేర్చేసుకోండి.
WHAAAAAAAAAAAAAAAT https://t.co/tLEl5BtQr3
— christine teigen (@chrissyteigen) June 17, 2019
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

