ఆయనకు ముందుంది మెుసళ్ల పండుగ

ఆయనకు ముందుంది మెుసళ్ల పండుగ

ట్రంప్ రూటే సపరేటు. నలుగురికి నచ్చినది...ఆయనకు నచ్చదు! విమర్శలకు జంకడు. వివాదాలకు తలొగ్గడు. చేయాలనుకున్నది చేసేస్తాడు. మైండ్ లో ఫిక్సైయితే బ్లైండ్ గా వెళ్లిపోతాడు. ఎప్పుడూ ఎదో ఒక తుగ్లక్ నిర్ణయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఇప్పుడు మరోసారి శ్వేతసౌదాధీశుడిగా మారేందుకు..సామదాన భేద దండోపాయలు ప్రయోగిస్తున్నాడు.

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరే సంచలనం. ఆయన ఏం చేసినా అదో సెన్సేషన్ . తన వింత చర్యలు, పిచ్చి చేష్టలతో ఎప్పుడూ వివాదాలను కొనితెచ్చుకుంటాడు ట్రంప్. ప్రెసిడెంట్ గా ఆయన పాలనను గమనించిన ప్రతి ఒక్కరూ ఇదే మాట చెబుతారు. అధ్యక్షుడిగా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయమూ విమర్శల పాలైంది. ఏడు ముస్లిం దేశాల నుంచి అమెరికాలోకి వలసలను నిషేధిస్తూ జారీ చేసిన ఆదేశాలు అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. అలా మొదలైన పిచ్చి నిర్ణయాలు ఒక హద్దు పద్దూ అంటూ లేకుండా సాగిపోయాయి. అమెరికానే ఫస్ట్ ... ఆ తర్వాతే అన్నీ అంటూ బహిరంగంగానే చెప్పేవాడు ట్రంప్. ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఉండేవి.

మెక్సికో గోడ వివాదం, వీసాలపై కఠిన నిబంధనలు, చైనా సహా ఇతర దేశాలతో వాణిజ్య యుద్ధం, భారత్ కు జీఎస్పీ హోదా తొలగింపు, ఇరాన్ తో యుద్ధానికి కాలుదువ్వడం...ఇలా ప్రతీది వివాదాస్పదమే.! ఇక ఎన్నికలు దగ్గరపడటంతో మరికొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు సై అంటున్నాడు ట్రంప్. అమెరికా ఫస్ట్-అమెరికా సేఫ్ అన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాడు. ఈ ఎన్నికల స్టంట్ ను ఎప్పటి నుంచో అమలు చేస్తున్నాడు. ఉత్తర కొరియాకు స్నేహహస్తం అందించడమైనా..కిమ్ జోంగ్ ఉన్ తో సమావేశమైనా.. ఇప్పుడు ఇరాన్ పై ఒంటికాలుతో లేస్తున్నా అదంతా ట్రంప్ ఎన్నికల వ్యూహమే. స్పాట్...

కుదిరితే మరోసారి సింపుల్ గా ప్రెసిడెంట్ అయిపోవాలి. లేదంటే సామదాన భేద దండోపాయలు ప్రయోగించాలి. ఇదే ట్రంప్ లెక్క. మళ్లీ గెలిచేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధమవుతున్నాడు ట్రంప్. ఆయన ఇటీవల చేస్తున్న పలు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తన ప్రత్యర్థికి సంబంధించిన సమాచారాన్ని విదేశాల నుంచి పొందేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. 2016 ఎన్నికల్లో రష్యా ప్రమేయముందన్న ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ వివాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. అయినా మరోసారి విదేశాల జోక్యాన్ని ప్రస్తావించి తేనెతుట్టెను కదిపారు ట్రంప్..ఇక సందర్భం దొరికిన ప్రతిసారి అమెరికా నా చేతుల్లో ఉంటేనే సేఫ్ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు . లేదంటే రక్షణపరంగానేకాదు ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని బహిరంగంగానే హెచ్చరిస్తున్నాడు...

చైనాతో ట్రంప్ సాగిస్తున్న ట్రేడ్ వార్ పై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా మూర్ఖంగా ముందుకెళ్తూనే ఉన్నాడు. వాణిజ్య యుద్ధం కారణంగా చివరికి అమెరికా ప్రజలు, రైతులే తీవ్రం గా నష్టపోతున్నారని తెలిసినా పంతం వీడటం లేదు. కేవలం చైనాను టార్గెట్ చేయడం ద్వారా దేశ ప్రజల్లో... సెంటిమెంట్ ను రెచ్చగొట్టడం ఒక్కటే ట్రంప్ లక్ష్యమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇరాన్ తో దూకుడుగా వ్యవహరించడం వెనుక కూడా ఆయన ఉద్దేశం ఇదేనన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నికల్లో లాభపడేందుకు ఇరాన్ పై యుద్ధాన్ని ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు నిపుణులు..

లోకల్ సెంటిమెంట్ తోపాటు.. ఇతర దేశాలతోనూ కఠినంగా వ్యవహరించడం, అవసరమైతే యుద్ధానికి దిగడం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందాలన్నది డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ గా తెలుస్తోంది. అయితే ఈ స్కెచ్ మరోసారి వర్కౌట్ అవ్వడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల వెల్లడైన పలు సర్వేల ఫలితాలు కూడా ట్రంప్ కు వ్యతిరేకంగానే వచ్చాయి. ఇక తాజా మరో ఇంటర్నెట్ సర్వే కలకలం రేపుతోంది.. ఈ ఒపీనియన్ పోల్స్ లో ఇతర నేతలకన్నా ట్రంప్ చాలా వెనుకబడి ఉన్నారు...డెమోక్రాటిక్ పార్టీ నుంచిరేసులో ఉన్న మాజీ అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ .. ట్రంప్ కన్నా చాలా ముందున్నాడు.. ఈ ఇంటర్నెట్ సర్వే లీకుపై ట్రంప్ భగ్గుమన్నాడు. ఇదంతా బూటకం అంటూ కొట్టిపారేశాడు.

అటు డెమొక్రాట్లు కూడా ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పొరుగుదేశాలతో మెరుగైన సంబంధాలు ఏర్పరచడంతోపాటు అమెరికాను ఆర్థికంగా మరింత పటిష్టం చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. మొత్తానికి అమెరికా అధ్యఎన్నికలు ఈసారి అత్యంత ఆసక్తిగా సాగే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ కు ముందుంది ముసళ్లపండుగ అంటున్నారు పొలిటికల్ ఎక్స్ పర్ట్స్..

Tags

Read MoreRead Less
Next Story