తెలంగాణ పోలీసులకు శుభవార్త.. ఏపీ పోలీసుల్లాగే..

తెలంగాణ పోలీసులకు శుభవార్త.. ఏపీ పోలీసుల్లాగే..

తెలంగాణ పోలీసులకు శుభవార్త. ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇచ్చినట్లుగానే... ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సైతం పోలీసులకు వీక్లీఆఫ్‌లు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇవాల్టి నుంచి పోలీసులకు వారంతపు సెలవులు అమలు చేస్తున్నారు. కానిస్టేబుల్‌‌ స్థాయి నుంచి ఇన్స్‌పెక్టర్‌ స్థాయి పోలీస్‌ అధికారి వరకు వీక్లీ ఆఫ్‌లు అమలు చేయాల్సిందిగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. వి. రవీందర్‌ ... ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇవాల్టి నుంచి వరంగల్ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులకు వారంతపు సెలవులు అమల్లోకి వచ్చాయి.

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. తీవ్ర పని ఒత్తిడితో ఉన్న పోలీసులకు వీక్‌ ఆఫ్‌ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గతంలోనే హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రకటించారు. ఇప్పుడు దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏపీ పోలీసుల్లాగే.... తమకూ వారంతపు సెలవులు ఇస్తుండటంతో... ఆనందం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story