వాయుసేన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు లభ్యం

వాయుసేన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు లభ్యం

భారత వాయుసేనకు చెందిన AN‌-32 విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రాణాలు విడిచిన వారిలో ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. మరో ఏడుగురి శరీర భాగాలు లభ్యమైనట్లు భారత వాయుసేన తెలిపింది. విమానం కూలిపో యిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌కు వాతావరణం అనుకూలించలేదు. దీంతో అక్కడికి వెళ్లిన కమాండోలకు అవాంతరాలు ఏర్పడ్డాయి. మృతదేహా లను గుర్తించడానికి పోర్టర్లు, వేటగాళ్లు పర్వతం మీదకు నడుకుచుంటూ వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా మృతదేహాలను వెలికి తీయడా నికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి 6 మృత దేహాలు, మరో ఏడుగురి శరీర భాగాలను గుర్తించారు.

ఈనెల 3వ తేదీన 13 మందితో ప్రయాణిస్తున్న AN-32 విమానం గల్లంతైంది.అసోంలోని జోర్హాట్‌ వైమానిక స్థావరం నుంచి బయలుదే రిన కాసేపటికే విమానం ఆచూకీ లభించలేదు. ఆ ఫ్లైట్ కోసం వైమానిక దళం, ఆర్మీ తీవ్రంగా గాలించా యి. చివరికి M.I-17 హెలికాప్టర్ సాయంతో AN-32 ఆచూకీని గుర్తించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్‌ జిల్లా పయూమ్‌ పరిధిలో విమానం కుప్పకూలినట్లు కనిపెట్టారు.

తాజాగా, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి వారి మృతదేహాలను గుర్తించారు. జోర్హాట్ లోని ఎయిర్ బేస్ కు మృతదేహాలు, శరీర భాగాలను చేర్చామని, వాటిని బంధువులకు అప్పగించనున్నామని అధికారులు తెలిపారు. విమానంలోని కాక్ పీట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ లను గతవారంలోనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాల్లో విమానం కూలిన కారణంగానే, విమానాన్ని గుర్తించడంలోనూ, మృతదేహాలను వెలికి తేవడంలోనూ ఆలస్యం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story