ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ రివ్యూ
నటీనటులు : నవీన్ పోలిశెట్టి,శృతి శర్మ,సుహాస్ తదితరులు.
దర్శకత్వం : స్వరూప్ రాజ్ ఆర్ జె ఎస్
నిర్మాత :రాహుల్ యాదవ్ నక్కా
సంగీతం : మార్క్ కె రాబిన్
స్క్రీన్ ప్లే : సన్నీ కూరపాటి
ఎడిటర్: అమిత్ త్రిపాఠి
నవీన్ పోలిశెట్టి, శృతిశర్మ ప్రధాన పాత్రలలో స్వరూప్ ఆర్ జె ఎస్ దర్శకత్వంలో ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిన మూవీ ‘‘ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ’’ ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన ఈ మూవీ ఎలా ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ని అందించిందో చూద్దాం..
కథ: ఆత్రేయ (నవీన్ పోలిశెట్టి) నెల్లూరు లో ఒక డిటెక్టివ్. చిన్నా చితకా కేసులను పరిష్కరించే ఆత్రేయ తన జీవితాన్ని మలుపు తిప్పే కేస్ కోసం ఎదరుచూస్తుంటూడు. ఒక క్రైమ్ సీన్ క ఇన్విస్టిగేషన్ కి వెళ్ళి అక్కడ అతనే ప్రైమ్ సస్పెక్ట్ అవుతాడు. అక్కడ సెల్ లో తనతో పాటు ఉన్న ఒక వ్యక్తి తన కూతురిని ఎవరో చంపేసారని, పోలీసులను ఆశ్రయిస్తే తనపై తప్పుడు కేసులుపెట్టి అరెస్ట్ చేసారని చెబుతాడు. ఆకేస్ పనిలో ఇద్దరి ని ఫాలో అవుతాడు ఆత్రేయ. ఆ ఇద్దరినీ ఎవరో చంపేస్తారు. ఆ కేసులో నిందితుడు గా ఆత్రేయ ను అరెస్ట్ చేస్తారు పోలీసులు. తనో కేసుకోసం ఇన్విస్టిగేషన్ మొదలు పెడితే అదే కేసులో తనే నిందితుడు అవుతాడు..? అసలు ఆ అమ్మాయిని చంపింది ఎవరు..? తను వెంబడించిన ఇద్దరినీ చంపింది ఎవరు..? తనపై వచ్చిన హాత్య కేసుల నుండి అతను ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన కథ..?
కథనం:
ఆత్రేయ తో నవీన్ పొలిశెట్టి అనే ప్రతిభా వంతుడైన ఆర్టిస్ట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. కామెడీని, సీరియస్ మిక్స్ చేసి ఏదీ ఎక్కడా బాలెన్స్ తప్పకుండా తన డిటెక్టివ్ పాత్ర కు ప్రాణం పోసాడు. తెలుగు తెరపై కనిపించిన అతి కొద్ది మంది డిటెక్టివ్స్ లో నవీన్ పోషించిన పాత్రకూడా తప్పకుండా గుర్తుంటుంది. దర్శకుడు స్వరూప్ రాసుకున్న కథ లో డెప్త్ ఎక్కువ ఉంది. ‘రైలు పట్టాల పై గుర్తు తెలియని శవం’ఇలాంటి హెడ్డింగ్స్ తరచుగా చూస్తూనే ఉంటాం.. కానీ వీటి వెనక ఎలాంటి క్రైమ్ దాగిఉండొచ్చు . అనే పాయింట్ ని తీసుకొని దర్శకుడు రాసుకున్న కథనం చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. మతం పేరుతో చేసే ఘోరాలు వెనుక దాగి ఉన్న క్రైం విస్తృత రూపాన్ని దర్శకుడు ఆవిష్కరించాడు. ఈ సీరియస్ పాయింట్ ని తీసుకొని ఆ పాయింట్ కి ఆత్రేయ ను కనెక్ట్ చేయడానికి దర్శకుడు సాగించిన ప్రయాణం ఆదత్యం ఉత్కంఠగా సాగింది. సినిమా ఇలాగే ఉండాలి అనే ఫార్మెట్ లు ఎక్కడా పట్టించుకోలేదు. ఆత్రేయ కి అసిస్టెంట్ గా చేసిన శృతి శర్మ పాత్ర కూడా పూర్తి వినోదాత్మకంగా మలిచాడు దర్శకుడు. హీరో అంటే హీరోయిన్ ఉండాలి, పక్కన అమ్మాయి ఉంది కాబట్టి ఏదో సందర్భంలో లవ్ టచ్ ఇవ్వాలనే భయాలను పెట్టుకోలేదు. ఇక సినిమా మొదలైన పది నిముషాలు పాత్రల పరిచయం అయ్యాక నవీన్ పాత్ర కు అటాచ్ అవ్వడం మొదలు పెడతాడు ప్రేక్షకుడు ఇక ఆపాత్ర తాలూకు అందించే ప్రతి ఎమోషన్ ని పూర్తిగా ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడు. డిటెక్టివ్ ఇంటిలెజెన్స్ ని చూపిస్తూనే ఆ పాత్ర తాలూకు లిమిటేషన్స్ పండించే కామెడీని మిస్ అవ్వకుండా క్యారెక్టర్ డిజైన్ చేసాడు. స్వరూప్ రాసుకున్న డైలాగ్స్ కానీ స్ర్కీన్ ప్లే కానీ చాలా బాగున్నాయి. ఎదో మంచి జరుగుతుంది ఆశ, ఏదో చెడు జరుగుతుంది అనే భయం మనిషి ని ఏదైనా నమ్మెలా చేస్తాయి.. మోసానికి దగ్గర చేస్తాయి. ఈ రెండు బలహీనతలను బేస్ చేసుకొని పుట్టిన నేరాలు యెక్క లోతు ఎంత ఉంటుందో ఈ సినిమాతో చూపించాడు దర్శకుడు. సెకండాఫ్ లో స్టోరీ సీన్ బై సీన్ చాలా గ్రిప్పింగ్ గా సాగుతుంది. శ్రీనివాస్ ఆత్రేయ ఇంకా ఊబిలో కూరుకుపోతున్నాడన్న టెన్షన్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇక స్టోరీ ని రివీల్ చేయడం మొదలు పెట్టాక ఒక షాకింగ్ ప్రజంటేషన్ ఇచ్చాడు దర్శకుడు. తన తల్లి కూడా ఈ క్రైమ్ కి భాదితురాలు అయ్యిందనే విషయం తెలిసిన తర్వాత అప్పటి వరకూ నవీన్ నటన మరింత హృద్యంగా మారింది. రాబిన్ అందిచిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. చిత్రీకరణ సాగే ప్రదేశాలు, ఎంచుకున్న సందర్భాలు అన్నీ కొత్తగా ఉన్నాయి. ఒక సాదాసీదా డిటెక్టివ్ ఒక పెద్ద క్రైమ్ ని ఎలా బ్రేక్ చేసాడు అనే జర్నీ ఇంట్రెస్ట్ గా సాగింది. నటుడిగా నవీన్, దర్శకుడిగా స్వరూప్ ఈ సినిమా తో మంచి స్కోర్ ని సాధించారు.
చివరిగా: కామెడీ ప్లేవర్ ని వదలకుండా ఆసక్తిగా సాగే థ్రిలర్ ‘‘ ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ’’. ఈ కొత్త రకం డిటెక్టివ్ ఎంటర్ టైన్ చేస్తూనే ఆసక్తి ని పెంచాడు. సరదాగా సాగే ఈ డిటెక్టివ్ జర్నీలో ప్రతి మలుపూ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. హార్రర్ కామెడీ లాగా థ్రిల్లింగ్ స్టోరీ లో కామెడీని మిక్స్ చేసివీకెండ్ కి మంచి ఎంటర్ టైనర్ గా మనముందు నిలిచాడు ‘‘ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ’’.
-కుమార్
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com