ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ప్రతి నెలా రూ.5,000..

ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ కలిగి ఉంటే అటల్ పెన్షన్ యోజనలో చేరొచ్చు. అటల్ పెన్షన్ యోజన (APY)అనేది ప్రభుత్వ పథకం. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ దీనిని నిర్వహిస్తుంది. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ వినియోగదారుల కోసం APYని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ పథకాన్ని ఆఫర్ చేస్తున్న తొలి పేమెంట్ బ్యాంక్ ఎయిర్ టెల్ కావడం గమనార్హం. అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులకు ప్రయోజనం కల్పించేందుకు, వృద్ధాప్యంలో సోషల్ సెక్యూరిటీ ఇచ్చేందుకు తీసుకు వచ్చిన పథకం ఇది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న కార్మికులు ఈ పథకంలో చేరవచ్చు. తమ ఎయిటెల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆర్థిక తోడ్పాటుకు చేయూతనందించడం సంతోషకరమని ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ ఎండీ, సీఈవో కూడా అయిన అనుబ్రత బిశ్వాస్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com