ఆంధ్రప్రదేశ్

జులై 12 న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

జులై 12 న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం
X

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఆమేరకు బడ్జెట్‌ సమావేశాల తేదీలను ఖరారు చేసింది. జులై 10 నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. మొత్తం 25 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జులై 12వ తేదీన 2019-20వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది .

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువుదీరిన జగన్‌ సర్కార్‌.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ జగన్ ఇచ్చిన నవరత్నాలు పథకాలతోపాటు ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనేపథ్యంలో ఏయే శాఖలకు ఎంతెంత కేటాయించాలన్న దానిపై శాఖల వారిగా సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు.

నవరత్నాలు అమలులో భాగంగా ఈసారి బడ్జెట్‌లో ఆయా శాఖలకు భారీగానే కేటాయింపుల చేయాల్సి ఉంది. ఫించన్లు, డ్వాక్రా రుణాల మాపీ, అమ్మవడి, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా , ప్రాజెక్టులు వంటి పలు కీలక అంశాలకు నిధుల కేటాయించాల్సి ఉంది. ఈనేపథ్యంలో లెక్కల పద్దును సిద్దం చేయాలని ఆర్థిక శాఖను సమాయత్తం చేసింది ప్రభుత్వం..

అటు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఏఏ శాఖకు ఎంతెంత నిధుల కేటాయిస్తారు.., ఏ రంగానికి పెద్ద పీట వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. బడ్జెట్ లో ఏఏ వరాలు ప్రకటిస్తారోనని ఏపీ ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Next Story

RELATED STORIES