ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల అభ్యంతరం

ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల అభ్యంతరం

ట్రిపుల్ తలాఖ్ బిల్లు మరోసారి పార్లమెంట్‌ ముందుకు వచ్చింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు-2019ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, ట్రిపుల్ తలాఖ్ బిల్లును దిగువసభలో ప్రవేశపెట్టారు. ముస్లిం మహిళలకు న్యాయం చేయడానికే ఈ బిల్లు తీసుకొచ్చామని రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.

ట్రిపుల్ తలాఖ్ బిల్లును కాంగ్రెస్, ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. తలాఖ్ విధానానికి తాము వ్యతి రేకమే అయినప్పటికీ, తలాఖ్ చెప్పడాన్ని నేరంగా పరిగణించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. మహిళల పట్ల మోదీ సర్కారు వివక్ష చూపుతోందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. ఈ సందర్భంగా శబరిమల అంశాన్ని ఒవైసీ ప్రస్తావించారు. బీజేపీ నాయకత్వం శబరిమల విషయంలో ఒక విధంగా, ట్రిపుల్ తలాఖ్ విషయంలో మరో విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగి సభలో గందరగోళం ఏర్పడింది.

Tags

Read MoreRead Less
Next Story