బంగ్లాదేశ్‌కు ఆసీస్ బ్రేక్.. బంగ్లా ఓటమికి కారణం ఇదే..!

బంగ్లాదేశ్‌కు ఆసీస్ బ్రేక్.. బంగ్లా ఓటమికి కారణం ఇదే..!

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మరో విజయాన్ని అందుకుంది. వరుస విజయాలతో దూసుకెళుతోన్న బంగ్లాదేశ్‌కు ఆసీస్ బ్రేక్ వేసింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో కంగారూలు 48 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 381 పరుగులు చేసింది. వార్నర్ సెంచరీతో చెలరేగితే... ఖవాజా, ఫించ్ , మాక్స్‌వెల్ కూడా రాణించారు. ఛేజింగ్‌లో బంగ్లాదేశ్ కూడా గొప్పగా పోరాడింది. ఒక దశలో టార్గెట్‌ను ఛేదించేలా కనిపించినా... ఆసీస్ బౌలర్లు పుంజుకోవడంతో ఓటమి తప్పలేదు. వికెట్ కీపర్ ముష్పికర్ రహీమ్ సెంచరీ చేయగా... మహ్మదుల్లా హాఫ్ సెంచరీతో పోరాడాడు. అయితే కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో బంగ్లా ఓటమికి కారణమైంది.

Tags

Next Story