కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వంపై దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు
కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వంపై దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఎన్నాళ్లు కొనసాగుతుందో చెప్పలేనని.. ఏ క్షణమైనా మధ్యంతర ఎన్నికలు రావొచ్చని బాంబు పేల్చారు. లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ఓటమికి జేడీఎస్ కారణమన్న కాంగ్రెస్‌పైనా విమర్శలు చేశారు. రెండ్రోజుల క్రితమే సంకీర్ణ ప్రభుత్వంలో.. చాలా తలనొప్పులున్నాయంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పడం.. ఇప్పుడు దేవెగౌడ మధ్యంతరం ప్రస్తావన తేవడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. ఫిబ్రవరి నుంచే కాంగ్రెస్-JDS మధ్య లుకలుకలు ఉన్నా.. లోక్‌సభ ఫలితాల తర్వాత ఆ బంధం మరించ చెడ్డట్టే కనిపిస్తోంది. అటు, BJP నుంచి ఆ రెండు పార్టీల నుంచి MLAలను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నటైమ్‌లో దేవెగౌడ మధ్యంతరం ప్రస్తావన తెచ్చారు.
ఐతే.. మధ్యంతరంపై దేవెగౌడ వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకున్నారు కర్నాటక పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావు. ఎందుకలా అన్నారో దేవెగౌడే చెప్పాలని అన్నారు. తమ పూర్తి మద్దతు జేడీఎస్ ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. ఐదేళ్లపాటు ప్రభుత్వం కొనసాగుతుందని అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com